జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది నిరసన
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది నిరసన

రెండు నెలలు దాటినా అందని వేతనాలు


చల్లపల్లిలో సిబ్బంది నిరసన

గుడివాడ, గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా 108 అంబులెన్స్‌ వాహనాల సిబ్బంది ఆదివారం బిక్షాటన చేశారు. గత నాలుగు రోజులుగా వారు తమ వాహనాల వద్దే వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ చిత్రాలను సంబంధిత కంపెనీ ప్రతినిధులకు, ప్రభుత్వాధికారులకు పంపుతున్నారు. రెండు నెలలు దాటినా తమకు వేతనాలు ఇవ్వలేదని, బకాయిలు చెల్లించడం లేదని, బీమా పెంచాలనే డిమాండ్‌లతో ఆందోళన చేస్తున్నారు. తొలిరోజు నినాదాలు, రెండోరోజు నల్లబ్యాడ్జీలతో, మూడో రోజు కళ్లకుగంతలతో, నాలుగో రోజు ఆదివారం బిక్షాటనతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లాలోని 50 మండలాల్లో అన్ని పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా, విజయవాడ ఆస్పత్రుల వద్ద ఉన్న 60 వాహనాలకు చెందిన సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. మరో రెండు రోజులు పాటు నిరసన తెలుపుతామని, స్పందించకుంటే రాష్ట్ర కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని కృష్ణా జిల్లా 108 వాహనాల సిబ్బంది సంఘం అధ్యక్షుడు కె.కోటేశ్వరరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని