పింఛనుదారులకు రూ.97.95 కోట్ల పంపిణీ
eenadu telugu news
Updated : 02/08/2021 02:49 IST

పింఛనుదారులకు రూ.97.95 కోట్ల పంపిణీ


పెనుమాకలో పింఛన్‌దారుకు నగదు అందజేస్తున్న సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక పథకంలో సాంఘిక భద్రత పింఛన్లు పొందుతున్న వారిలో 4,11,851 మందికి రూ.97.95 కోట్లను వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రక్రియను ప్రారంభించినా సాంకేతిక సమస్యలతో కొంత ఆలస్యమైంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో ఇంతియాజ్‌, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌ నాయక్‌ తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాలను సందర్శించి పింఛన్ల పంపిణీని పరిశీలించారు. ముగ్గురు లబ్ధిదారులతో ఐరిస్‌పై వేలి ముద్ర వేయించి పింఛన్‌ సొమ్మును అందజేశారు. జులై నెలకు సంబంధించి 5,85,069 మంది లబ్ధిదారులకు రూ.140.42 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. శనివారం రాత్రి 8 గంటల వరకు రూ.119 కోట్లు అధికారుల పీడీ ఖాతాల్లో నగదు జమయ్యాయి. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల బ్యాంకు ఖాతాల్లో రూ.113 కోట్లు జమయ్యాయి. సీఎఫ్‌ఎంస్‌ నుంచి బిల్లులు ఆమోదించడంలో జాప్యం జరగడంతో రూ.21 కోట్లు జమ కాలేదు. ఆదివారం సెలవైనా బ్యాంకు ఉన్నతాధికారులతో డీఆర్‌డీఏ అధికారులు మాట్లాడి మాచవరం, పిడుగురాళ్ల, పేరేచర్లలోని బ్యాంకులను తెరిపించారు. దీంతో సచివాలయ సిబ్బంది నగదు డ్రా చేసి లబ్ధిదారులకు అందజేశారు. ఆదివారం సాయంత్రానికి రూ.97.95 కోట్లను పంపిణీ చేశారు. మిగిలిన వారికి ఈనెల 3వ తేదీ లోపు పంపిణీ చేయనున్నారు. శనివారం జమ కాని రూ.21 కోట్లు సోమవారం జమయిన తర్వాత లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని