ఏపీజీపీసెట్‌కు 1,354 మంది హాజరు
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

ఏపీజీపీసెట్‌కు 1,354 మంది హాజరు


పరీక్ష హాలును తనిఖీ చేస్తున్న డీసీవో వెంకటరావు

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీజీపీసెట్‌కు 1,354 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలోని 12 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం పది నుంచి 12.00 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,703 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 360 మంది గైర్హాజరయ్యారు. జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సమన్వయకర్త జి.వెంకటరావు రేపల్లెలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు, పరీక్ష నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించారు. పరీక్ష పత్రంలో ప్రశ్నలకు ఆబ్జెక్టివ్‌ విధానంలో సమాధానాలు ఓఎంఆర్‌ పత్రంలో బబ్లింగ్‌ చేయాల్సి ఉండటంతో కొందరు విద్యార్థులకు అవగాహన లేక వరుస క్రమంలో గడులు నింపారు. గుర్తించిన ఇన్విజిలేటర్లు విద్యార్థులకు చెప్పి సరి చేయించారు. కరోనా కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో ఎక్కువ మంది విద్యార్థులకు పరీక్ష రాయడంపై అవగాహన లేకుండా పోయిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని