‘వీఆర్‌ఏలపై ప్రభుత్వం చిన్నచూపు’
eenadu telugu news
Published : 04/08/2021 01:13 IST

‘వీఆర్‌ఏలపై ప్రభుత్వం చిన్నచూపు’

ధర్నాలో పాల్గొన్న వీఆర్‌ఏలు

అలంకార్‌కూడలి (విజయవాడ), న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టిన ధర్నా రెండో రోజూ (మంగళవారం) కొనసాగింది. పెద్ద ఎత్తున వీఆర్‌ఏలు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలకు రూ.21 వేలు వేతనం ఇవ్వాలని, నామీనీలను వీఆర్‌ఏలుగా నియమించాలని డిమాండ్‌ చేశారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు ప్రభుత్వ తీరును ఖండించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యనారాయణ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్‌కుమార్‌, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి, అధ్యక్షుడు ఎస్‌.పెద్దన్న, జిల్లా కమిటీ నాయకులు పాతూరి ప్రభాకరరావు, రోశయ్య (గుంటూరు), బొడ్డు వెంకటరత్నం (కృష్ణా), వివేకానంద (ప్రకాశం), హజరత్తయ్య, సుబ్బయ్య, ఆంజనేయులు (నెల్లూరు) తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని