ఎయిమ్స్‌ రహదారి పూర్తి
eenadu telugu news
Published : 04/08/2021 01:13 IST

ఎయిమ్స్‌ రహదారి పూర్తి

పూర్తయిన 120 అడుగుల రోడ్డు

మంగళగిరి, న్యూస్‌టుడే: నగరంలోని ఎయిమ్స్‌ను చేరుకోవడానికి విశాలమైన 120 అడుగుల రహదారి అందుబాటులో వచ్చింది. 5న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎయిమ్స్‌ ఆవరణలో జరిగే వనమహోత్సవానికి రానున్నారు. ఈ నేపథ్యంలో 16వ నంబరు జాతీయ రహదారిలో వడ్డేశ్వరం నుంచి ఆసుపత్రి వరకు సుమారు 3 కిలోమీటర్ల రోడ్డును యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి మూడేళ్లుగా ఎన్నో అవరోధాలు ఎదురైన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి ఎయిమ్స్‌కు వచ్చే రోగులు, వైద్యులు, సిబ్బందికి ఈ రోడ్డు నిర్మాణంతో ప్రయాణ దూరం 6 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఇప్పటివరకు ఇక్కడి వచ్చేవారు మంగళగిరి వరకు ప్రయాణించి, తిరిగి ఎయిమ్స్‌కి వెళ్లాల్సి వచ్చేది. 5వ తేదీ నుంచి ఈ కష్టాలు ఉండవు. ఈ మార్గం గుండా ఎయిమ్స్‌లో ప్రవేశించే చోట ముఖద్వారం నిర్మాణం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని