నేటి నుంచి రైతు స్పందన
eenadu telugu news
Published : 04/08/2021 01:13 IST

నేటి నుంచి రైతు స్పందన

గుడివాడ, గుడ్లవల్లేరు, కృష్ణలంక, న్యూస్‌టుడే : తహసీల్దారు కార్యాలయాల్లో రైతు స్పందన కార్యక్రమాన్ని బుధవారం నుంచి నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రతి నెలా మొదటి, మూడో బుధవారం రైతు స్పందన కార్యక్రమం చేపట్టి సాగులో అన్నదాతలకు ఎదురయ్యే సమస్యలను వివిధ శాఖల ద్వారా పరిష్కరించేందుకు దీన్ని చేపట్టాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించే ఈ స్పందనలో రైతులు సాగులో తమకు ఎదురవుతున్న అన్ని రకాల సమస్యలను అర్జీ రూపంలో, మౌఖికంగానూ అధికారులు తెలియజేయవచ్చు. వ్యవసాయశాఖ ఏడీఏ, ఏఓ, తహసీల్దార్‌, ట్రాన్స్‌కో ఏఈఈ, ఇరిగేషన్‌ ఏఈఈ, పశుసంవర్ధకశాఖ ఏడీ, ఉద్యాన శాఖ ఏడీ, సెరీకల్చర్‌ ఏడీలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు.సమీపంలోని వ్యవసాయ పరిశోధనా స్థానం లేదా కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి వ్యవసాయ, ఉద్యాన శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు అవసరమైన సూచనలను అందిస్తారన్నారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని