దొంగనుకొని దాడి
eenadu telugu news
Published : 04/08/2021 02:24 IST

దొంగనుకొని దాడి


బిహార్‌కు చెందిన వ్యక్తిని స్తంభానికి కట్టేసిన స్థానికులు

బాపట్ల, న్యూస్‌టుడే : పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించి సామగ్రి అపహరించుకెళ్తున్నాడన్న అనుమానంతో బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని గ్రామస్థులు బంధించి, దాడిచేసి పోలీసులకు అప్పగించిన ఘటన బాపట్ల మండలం కంకటపాలెంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన వ్యక్తి గ్రామంలోని ఇళ్ల ఆవరణలో ఉన్న సామగ్రి తీసుకెళ్తుండగా స్థానికులు పట్టుకొని ప్రశ్నించారు. అతను హిందీలో మాట్లాడడంతో అర్థం కాలేదు. దొంగతనాలకు వచ్చాడన్న అనుమానంతో స్తంభానికి కట్టేసి కొట్టారు. అనంతరం బాపట్ల గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై ఎస్సై వెంకటప్రసాద్‌ మాట్లాడుతూ.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేదని, ఘటనపై విచారణ చేస్తామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని