నేడు సాగర్‌ కుడి కాలువకు..
eenadu telugu news
Published : 04/08/2021 02:24 IST

నేడు సాగర్‌ కుడి కాలువకు..

మాచర్ల, న్యూస్‌టుడే : నాగార్జునసాగర్‌ కుడికాలువకు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి జల వనరుల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు ఏపీ ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీటి విడుదల చేస్తారు. కుడికాలువ పరిధిలోని 9 గేట్లను పైకెత్తి 500 క్యూసెక్కుల నుంచి 6000 క్యూసెక్కుల వరకు నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్‌ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ఇప్పటికే జలాశయం 587 అడుగులతో నిండుకుండలా మారింది.11 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు నీటి విడుదల నేపథ్యంలో సాగుకు సిద్ధమయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని