పౌష్టికాహారంతో కూడిన విద్యనందించడమే లక్ష్యం
eenadu telugu news
Published : 04/08/2021 02:24 IST

పౌష్టికాహారంతో కూడిన విద్యనందించడమే లక్ష్యం


కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి తానేటి వనిత. పక్కన ఎమ్మెల్యే వెంకట రోశయ్య తదితరులు

పెదకాకాని, న్యూస్‌టుడే: పేద కుటుంబాల్లోని చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లలో నిర్మించిన ‘వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రా’న్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఇక్కడ చిన్నపిల్లల కుర్చీలు, టేబుళ్లు, జారుడు బల్ల, ఊయల, బాలల మరుగుదొడ్లు, వాటర్‌ ఫిల్టర్‌, వంటగదితో పాటు మరో రెండు గదులున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగానికి మొదటి ప్రాధాన్యమిచ్చారని, ‘నాడు-నేడు’లో భాగంగా కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారన్నారు. రాష్ట్రంలోని 4 వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలను ఈ తరహాలో అభివృద్ధి చేయనున్నట్టు ఆమె చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో సీఎం జగన్‌ విజయవంతమైనట్టు చెప్పారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే ప్రాంగణంలో మొక్కలు నాటి, చిన్నారులకు అన్నప్రాశన చేశారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, జేసీీ ప్రశాంతి, జేసీీ(హౌసింగ్‌) నిరుపమ, సర్పంచి వేల్పుల శ్రావణి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని