ఏకగవాక్షం..అయోమయం
eenadu telugu news
Published : 05/08/2021 06:23 IST

ఏకగవాక్షం..అయోమయం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

పొదుపు సంఘాల వారీగా ఏ సంఘం వద్ద ఎంత నగదు నిల్వ ఉందనే వివరాల సేకరణ ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా జరుగుతోంది. దాని తరువాత గ్రామ, మండల సమాఖ్యల వద్ద ఉన్న నిల్వ నగదు వివరాలు సేకరించి వాటినే జీవనోపాధుల కల్పనకు పొదుపు మహిళలకు రుణాలు ఇచ్చే కార్యాచరణ రూపొందిస్తున్నారు.

● కొత్త విధానంలో ప్రభుత్వం సూచించిన 125 యూనిట్లలో ఏది ఏర్పాటు చేసుకుంటే దాని విలువ ఆధారంగానే రుణం ఇస్తారు. గరిష్ఠంగా ఒక సభ్యురాలికి రూ.రెండు లక్షలు, కనిష్ఠంగా రూ.25 వేలు, అత్యవసరమైతే రూ.10 వేలు ఇవ్వనున్నారు.

స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు రుణాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన ఏకగవాక్ష విధానం పొదుపు మహిళల్ని అయోమయానికి గురి చేస్తోంది. బ్యాంకుల నుంచి ఈ ఏడాది రుణాల పంపిణీ ఉండబోదని సంఘంగా దాచుకున్న పొదుపు నగదుతో రుణ అవసరాలు తీర్చుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతుండటంతో అలా.. ఎలా? అనే సందేహాన్ని సంఘాల బాధ్యులు లేవదీస్తున్నారు. బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం వడ్డీతో సహా చెల్లించి మళ్లీ రుణం కోసం ఎదురుచూడటం ఇప్పటివరకు జరుగుతున్న తంతు. దీనికి స్వస్తి పలికి సంఘాల్లోని పొదుపు నగదుతో సభ్యుల అవసరాలను ఇక నుంచి తీర్చనున్నారు. గృహ నిర్మాణం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, స్వయం ఉపాధి అవసరాలకు బ్యాంకు నుంచి డబ్బులు అందుతాయని ఎదురుచూస్తున్న వారు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు లింకేజి రుణాలు నిలుపుదల చేసిన నేపథ్యంలో స్త్రీనిధి, ఉన్నతి రుణాల లక్ష్యాల్ని అందుకోవడంపై దృష్టి సారించనున్నారు.

స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి చాలా గ్రూపులకు తమ సంఘం ఉమ్మడి బ్యాంకు ఖాతాలో ఎంత పొదుపు నగదు ఉందో తెలియని పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పొదుపు సంఘం, గ్రామ సమాఖ్య, మండల సమాఖ్యలో రూ.లక్షల నిధులు నిరుపయోగంగా ఉంటున్నాయి. బ్యాంకుల నుంచి లింకేజి రుణం తీసుకుంటే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఈ సంఘాల నుంచి రుణాలు పంపిణీ చేస్తే అవి ఆర్థికంగా మరింత పరిపుష్ఠి అవుతాయని భావించి రుణాల మంజూరుకు ఏకగవాక్ష విధానాన్ని ఈ ఏడాది అమలులోకి తెచ్చారు. సంఘాల వద్ద ఉన్న నగదు సభ్యుల రుణ అవసరాలకు సరిపోకపోతే పెద్ద మొత్తంలో నగదు కోసం అప్పుడు బ్యాంకుల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. ఒక సంఘం బ్యాంకు నుంచి రూ.10 లక్షలు లింకేజి రుణంగా తీసుకుంటే ఇప్పటివరకు పది మంది సభ్యులు రూ.లక్ష చొప్పున పంచుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా సంఘంలో ఉన్న పొదుపు నగదును ముందుగా గుర్తించి.. ఆర్థిక అవసరాలున్న సభ్యులకు నగదు రుణంగా ఇవ్వనున్నారు. వడ్డీగా వచ్చే నగదును సభ్యులందరూ పంచుకోనున్నారు. స్త్రీనిధి, ఉన్నతి పథకాల కింద ఎప్పటిలాగే రుణాలు ఇవ్వనున్నారు. ఏకగవాక్ష విధానంపై పొదుపు మహిళలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించని పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొని ఉంది.

సంఘాల పొదుపు నగదుతోనే సభ్యులకు రుణాలు

*● బ్యాంకు లింకేజి కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 41,475 సంఘాలకు రూ.1,230 కోట్లు రుణ పంపిణీ లక్ష్యం కాగా 58,337 సంఘాలకు రూ.1,735 కోట్లు పంపిణీ చేశారు. రుణ పంపిణీలో గత ఏడాది రాష్ట్రంలో రెండో స్థానంలో జిల్లా నిలిచింది. ఈ ఏడాది రుణ పంపిణీ లక్ష్యాలేవీ ప్రభుత్వం నిర్దేశించలేదని వెలుగు అధికారులు తెలిపారు.

*ఉన్నతి కార్యక్రమం కింద రుణ పంపిణీ లక్ష్యం స్త్రీనిధి రుణ పంపిణీ లక్ష్యం (2021-22)కి ఎస్సీలకు రూ.30 కోట్లు ఎస్టీలకు రూ.7 కోట్లు రూ.258 కోట్లు ఇప్పటికే రూ.55 కోట్లు పంపిణీ చేశారు.


జిల్లాలో గ్రామీణప్రాంతాల్లోని స్వయంసహాయక సంఘాలు

75,012

సంఘాల్లో సభ్యులు

7,57,702

గ్రామ సమాఖ్యలు

2,212

మండల

సమాఖ్యలు

57


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని