వనమహోత్సవంలో మొక్కలు నాటాలి
eenadu telugu news
Published : 05/08/2021 06:23 IST

వనమహోత్సవంలో మొక్కలు నాటాలి

636 స్కూళ్లు.. 36వేలకు పైగా లక్ష్యం

బొప్పాయి, అరటి, సపోటా, జామ, దానిమ్మ వంటి పలు పండ్ల రకాల మొక్కలను నాటనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే అవి కొన్ని అయినా కాయలుకాసేలా కొన్ని మొక్కలను నాటనున్నారు. దీనికి సంబంధించి ఉద్యానవనశాఖ అధికారులను సంప్రదించి సాధ్యమైనంత త్వరగా పండ్లు వచ్చే మొక్కలు ఏమిటో తెలుసుకుని వాటిని నాటడానికి ప్రణాళికలు రూపొందించారు. ప్రతి మొక్కకు 5 మీటర్ల దూరం ఉండేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు పంపిన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. 50 మొక్కలకు మించి నాటవద్దని సూచించారు. వాటిని పాఠశాల క్రీడా ప్రాంగణం, స్కూలు ప్రవేశ ద్వారం తదితర ప్రదేశాల్లో పెంచాలని ఆదేశించారు. వీటితో పాటు మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను పెంచటానికి మరికొన్ని పాఠశాలల్లో చర్యలు చేపట్టనున్నారు. అధిక ఉష్ణోగ్రతలను తగ్గించటానికి, కాలుష్య సమస్యల నుంచి ప్రజలను దూరం చేయటానికి పండ్లమొక్కల పెంపకం దోహదం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. పండ్ల మొక్కల పెంపకంపై సమగ్రశిక్ష జిల్లా పథక సంచాలకులు ఎం.వెంకటప్పయ్య మాట్లాడుతూ వనమహోత్సవంలో భాగంగా వాటిని నాటనున్నట్లు చెప్పారు. పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉన్నవారికి వాటిని అందజేస్తామని, ఆ ఉద్దేశంతోనే వాటిని నాటనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బాగుందని ప్రశంసించారని గుర్తు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని