షాపులు పెంచడమే మద్యపాన నిషేధమా...?: జీవీ
eenadu telugu news
Published : 05/08/2021 06:35 IST

షాపులు పెంచడమే మద్యపాన నిషేధమా...?: జీవీ

పట్టాభిపురం, న్యూస్‌టుడే: గత ఎన్నికల్లో ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ ఏమైందో సీఎం జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని నరసరావుపేట పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మద్యం షాపులు ఇబ్బడి ముబ్బడిగా పెంచడం, రాష్ట్రంలో మద్యం ఏరులై పారించడమే మద్యపాన నిషేధమా.. అని ప్రశ్నించారు. ‘వాక్‌ ఇన్‌ స్టోర్‌ పేరుతో పట్టణాల్లో 90 మద్యం మాల్స్‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పర్యాటక ప్రాంతాల్లో మద్యం షాపులు ప్రారంభించింది. కమీషన్ల కోసం నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ జగన్‌ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఏడాదికి రూ.5000 కోట్ల జే ట్యాక్స్‌ పేరిట దండుకుంటూ అయిదేళ్లల్లో రూ.25,000 కోట్ల దోపిడీకి ప్రణాళిక రూపొందించారు. సంపద సృష్టించడం చేతగాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. అప్పులు తీర్చేందుకు మద్యం షాపులు, రేట్లు పెంచుకుంటూ పోతున్నారు’.. అని మండిపడ్డారు. తక్షణమే మద్యపాన నిషేధం అమలు చేయాలని, లేదంటే ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని