559 మందికి ఒక్కరూ రాయలేదు
eenadu telugu news
Updated : 16/09/2021 13:03 IST

559 మందికి ఒక్కరూ రాయలేదు


అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఖాళీగా బల్లలు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ఇంటర్‌ పరీక్షలను నిర్వహించేందుకు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఎంపిక చేశారు. బుధవారం మొదటిరోజు జరిగిన పేపర్‌-2 పరీక్షకు 559 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఇక్కడ కేటాయించగా ఒక్కరు కూడా హాజరు కాలేదు. మరో కేంద్రం ఎస్‌.వి.ఎల్‌.జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్నం జరిగిన ఇదే పరీక్షకు 378 మంది విద్యార్థులను కేటాయించగా, ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో ఆయా కేంద్రాలకు వచ్చిన ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని