టైరు పేలి.. కాల్వలోకి దూసుకెళ్లి..
eenadu telugu news
Updated : 16/09/2021 13:09 IST

టైరు పేలి.. కాల్వలోకి దూసుకెళ్లి..

నూజివీడు రూరల్‌, ఆగిరిపల్లి: విజయవాడ వైపు వెళుతున్న బస్‌ టైరు పేలిపోయి అదుపు తప్పి మార్జిన్‌లోని కాల్వలోకి దూసుకెళ్లిన సంఘటన మండలంలోని రావిచర్ల క్రాస్‌ రోడ్డు వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఈ బస్సు నూజివీడు ఆర్టీసీ డిపో నుంచి ఎర్రగొండపాలెంకు బయలు దేరింది. ఆ సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులున్నారు. డిపో నుంచి బయలు దేరిన కొద్ది సేపటి తరువాత రావిచర్ల క్రాస్‌ రోడ్డు దాటగానే టైర్‌ అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కి పడ్డారు. అదుపు తప్పిన బస్సును డ్రైవర్‌ అప్రమత్తమై రోడ్డు అంచున ఉన్న కాల్వలోకి దించడంతో పెను ప్రమాదం తప్పింది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.. నూజివీడు ఆర్టీసీ డీఎం ధీరజ్‌, ఎస్సై ఎన్‌.చంటిబాబు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మరో బస్సును తెప్పించి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు పంపారు. స్థానికుల సాయంతో పోలీసులు బస్సును కాల్వ నుంచి బయటకు తీయించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని