ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
eenadu telugu news
Published : 16/09/2021 03:01 IST

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం


పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ జె.నివాస్‌

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : జిల్లాలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు 142 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని బిషప్‌ అజరయ్య జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జిల్లాలో 1,13,538 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. మొదటి రోజు జరిగిన ప్రథమ సంవత్సరం ఇంటర్‌, ఒకేషనల్‌ పరీక్షలకు 54,613 మంది విద్యార్థులకుగాను 38,712 మంది హాజరయ్యారని వెల్లడించారు. కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని