Jagananna Colony: జగనన్న లేఔట్లలో వరినాట్లు
eenadu telugu news
Updated : 16/09/2021 12:54 IST

Jagananna Colony: జగనన్న లేఔట్లలో వరినాట్లు


మోదుమూడి ఎస్సీ కాలనీలోని జగనన్న కాలనీ (పాతచిత్రం)
అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి లబ్ధిదారులను గృహాలను నిర్మించుకోవాలని సూచించింది. కానీ ఆచరణలో మాత్రం అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. అవనిగడ్డ మండలం మోదుమూడి ఎస్సీకాలనీ ఉన్న కొంత స్థలాన్ని ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించి నివేసన స్థలాల లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకోవడానికి సుమారు 81 మందికి పంపిణీ చేశారు. అనంతరం లేఔట్లు కూడా వేశారు. ఈక్రమంలో అప్పటికే ఆ భూమిని ఆక్రమించుకున్న పలువురు లబ్ధిదారులకు కేటాయించిన సుమారు 10 ప్లాట్లలో ఈ ఖరీఫ్‌లో వరినాట్లు వేశారు. ఈ విషయాన్ని లబ్ధిదారులు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా వారు పట్టించుకోలేదు. దీనిపై తహసీల్దారు శ్రీనునాయక్‌ను వివరణ కోరగా.. లబ్ధిదారులు గృహనిర్మాణాలకు ముందుకు వస్తే ఆక్రమించిన నివేశన స్థలాలను అప్పగిస్తామని చెప్పడం గమనార్హం.
ప్రస్తుతం అక్కడ వరినాట్లు వేసిన దృశ్యం
 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని