జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు రాజీలేని పోరాటం
eenadu telugu news
Published : 16/09/2021 03:43 IST

జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు రాజీలేని పోరాటం

అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌టుడే : కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు రాజీలేని పోరాటం చేస్తామని ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, కె.ఎస్‌.లక్ష్మణరావు అన్నారు. నూతన జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి-యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం దాసరిభవన్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. మండలిలో జాబ్‌ క్యాలెండర్‌ విషయమై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతామని, 2.40 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆర్థిఖ శాఖ చెప్పిన మాటల ఆధారంగానే విద్యార్థి-యువజన సంఘాల నేతలు, ప్రతిపక్ష పార్టీలన్నీ అడుగుతున్నాయని, ప్రభుత్వం మౌనం పాటిస్తోందని పేర్కొన్నారు. జూన్‌ 18వ తేదీన ఉద్యోగాల విప్లవం పేరుతో 10143 పోస్టులు మాత్రమే విడుదల చేయడం దుర్మార్గమన్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసి, పోరాటం కొనసాగించాలని సమావేశం తీర్మానించింది. వివిధ సంఘాల నాయకులు రవిచంద్ర, అరుణ్‌కుమార్‌, పృథ్వీ, అఫ్సర్‌, సాయి అరుణ్‌కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని