మనోవేదనతో రాజధాని రైతు మృతి
eenadu telugu news
Published : 16/09/2021 05:14 IST

మనోవేదనతో రాజధాని రైతు మృతి


ధనసిరి సాంబయ్య (పాత చిత్రం)

వెలగపూడి (తుళ్ళూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర రాజధాని అమరావతి తరలిపోతుందన్న మనోవేదనకు గురైన గుంటూరు జిల్లా వెలగపూడి గ్రామ రైతు ధనశిరి సాంబయ్య (60) బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన రాజధాని నిర్మాణానికి అరెకరం భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు. రాజధాని గ్రామాల్లో చేపట్టిన నిరసన ఉద్యమాల్లో సాంబయ్య చురుగ్గా పాల్గొనేవారు. రెండేళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం కరుణించకపోడంతో కొద్దిరోజులుగా తీవ్రంగా బాధపడుతున్న ఆయన మంగళవారం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయారు. ఆయన మృతిపట్ల రాజధాని అమరాతి ఐక్యకార్యాచరణ సమితి విచారం వ్యక్తం చేసింది. రాజధాని రైతుల చావులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సమితి పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని