తులసిరెడ్డికి ఎయిమ్స్‌లో చికిత్స
eenadu telugu news
Published : 16/09/2021 05:14 IST

తులసిరెడ్డికి ఎయిమ్స్‌లో చికిత్స


వైద్యుడితో మాట్లాడుతున్న తులసిరెడ్డి, పరామర్శకు వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు మస్తాన్‌వలి, ఈశ్వరరావు, సలీమ్‌ తదితరులు

మంగళగిరి, న్యూస్‌టుడే: ఏపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి బుధవారం మంగళగిరిలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. గుంటూరులో కాంగ్రెసు జిల్లా, నియోజకవర్గ కమిటీల సమావేశానికి మధ్యాహ్నం హాజరు కావాల్సిన ఆయన, విజయవాడలోని ఓ అతిథి గృహంలోని బాత్‌రూంలో ఉదయం కాలు జారి పడిపోయారు. ఎడమ వైపు తుంటి ఎముక, చేతి వేళ్లు విరిగినట్లు పార్టీ నాయకులు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి షేక్‌ సలీమ్‌ ఆయనను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయాలన్నారు. తాను కడపలోనే శస్త్రచికిత్స చేయించుకుంటానని తులసిరెడ్డి చెప్పడంతో వైద్యులు అంగీకరించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం సాయంత్రం ఆయనను అంబులెన్స్‌లో కడపకు పంపారు. అంతకుముందు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి, జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు ఆయన్ను పరామర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని