గణేష్‌ నిమజ్జన ఊరేగింపు ఉద్రిక్తం
eenadu telugu news
Published : 16/09/2021 05:14 IST

గణేష్‌ నిమజ్జన ఊరేగింపు ఉద్రిక్తం

తెదేపా వర్గీయులపై వైకాపా శ్రేణుల దాడి


గొడవ పడుతున్న వైకాపా, తెదేపా వర్గీయులను నియంత్రిస్తున్న పోలీసులు

పార్వతిపురం (ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: మండలంలోని పార్వతిపురం గ్రామంలో బుధవారం నిర్వహించిన వినాయక నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ జరగడంతో ఉద్రిక్తతను సంతరించుకుంది. వైకాపా వర్గీయులు పార్టీ పతాకాలు డీజే, తీన్‌మార్‌ డప్పులతో ఊరేగింపు చేస్తుండగా, తెదేపా వర్డీయులు అడ్డు చెప్పారు. ఆగ్రహించిన వైకాపా వర్గీయులు వారిపై దాడికి పాల్పడ్డారు. మహిళలు, యువకులను కొట్టారు. నిమజ్జన ఊరేగింపు సాధారణంగా పోలీసుల పర్యవేక్షణలో సాగుతుంది. కానీ పార్వతిపురంలో వైకాపా వర్గీయులు సాయంత్రం 5 గంటలకు డీజేలు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో ఊరేగింపును హోరెత్తిస్తున్నా పోలీసులు కనిపించలేదు. ఇదే అదనుగా వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. మరోసారి తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు విరుచుకుపడుతుండగా అక్కడికి చేరుకున్న పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రశాంతి, చేబ్రోలు సీఐ మధుసూదనరావుతో పాటు ప్రత్తిపాడు ఎస్సై అశోక్‌ ఊరేగింపు వద్దకు చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతపరిచారు. ఈ సందర్భంగా తెదేపా వర్గీయులు తమపై దాడి జరిగిందని పోలీసు అధికారులకు చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వాలని పోలీసులు అధికారులు తెలపడంతో వారంతా ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌ చేరుకొని పడిగాపులు కాశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని