AP Cabinet: కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం
eenadu telugu news
Published : 16/09/2021 13:27 IST

AP Cabinet: కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఆర్గానిక్‌ ఫామ్‌ సంస్థలే ఉత్పత్తులను విక్రయించేలా కొత్త విధానం తీసుకొచ్చేందుకు వీలుగా ఆర్గానిక్‌ ఫార్మింగ్ సర్టిఫికేషన్‌ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ఆసరా రెండో విడత నిధుల మంజూరు.. బడులు, ఆస్పత్రులకు సాయం చేసిన దాతల పేర్లు పెట్టే విధానంపై సమావేశంలో చర్చిస్తున్నారు. విశాఖ మన్యంలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశముంది. కొత్తగా బద్వేలు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు సహా మొత్తం 40 అంశాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసే వీలుంది. ఎల్జీ పాలిమర్స్ భూములను వెనక్కి తీసుకునే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించనున్నట్టు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని