చౌత్రా సెంటర్‌లో భవనంపై సమసిన వివాదం
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

చౌత్రా సెంటర్‌లో భవనంపై సమసిన వివాదం


చౌత్రా సెంటర్‌లో ఆక్రమణకు గురైన భవనంపై చెరిపేసిన రాతలు 

ఈనాడు-అమరావతి: నగరంలోని చౌత్రా సెంటర్‌లో రూ.కోట్ల విలువచేసే భవంతిని ఆక్రమణదారుల నుంచి నగర ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఖాళీ చేయించారు. దాని హక్కుదారైన పొట్టి రంగారావు గుప్తాను ఆ ఇంట్లోకి తిరిగి ప్రవేశించేలా మార్గర సుగమం చేశారు. ఈ పరిణామాలు గురువారం రాత్రి చోటుచేసుకున్నాయి. రంగారావు గుప్తాకు చెందిన భవనంలోకి ఇటీవల కొందరు వ్యక్తులు ప్రవేశించి దాని హక్కుదారున్ని బెదిరింపులకు గురి చేశారు. ఈ ఇల్లు తమదేనంటూ ఏకంగా గోడలపై ఫోన్‌ నంబర్లతో సహా ముద్రించారు. దీంతో భయపడిపోయిన అసలు యజమాని ఈ వ్యవహారంపై ఈనెల 6న లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మిన్నకుండిపోయారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ ప్రజాప్రతినిధి హస్తం ఉందనే ప్రచారం జరిగింది. పోలీసులు డాక్యుమెంట్లు పరిశీలించి దాని హక్కుదారెవరో గుర్తించే ప్రయత్నాలు చేస్తుండగా వారికి సివిల్‌ వ్యవహారాల్లో మీరెలా తలదూరుస్తారని ఒత్తిళ్లు వచ్చిపడినట్లు తెలిసింది. బలవంతంగా ఇల్లు స్వాధీనంపై మీడియాలో కథనాలు రావడం, ఈ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లటంతో ఈ వ్యవహారాన్ని మరింత రచ్చకాకుండా పరిష్కరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తన ఇంట్లో ప్రవేశించిన వ్యక్తులను ఎమ్మెల్యేలు ముస్తాఫా, గిరిధర్‌లు దగ్గరుండీ బయటకు పంపించి తనను తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టించారని భవన యజమాని పొట్టి రంగారావు గుప్తా గురువారం రాత్రి ‘ఈనాడు’కు వెల్లడించారు. ఇంతకుముందు ఆ భవనం తనదేనంటూ రాసిన రాతలను చెరిపివేయించారని, సీసీ కెమెరాలను తీసి వేయించి తనను ఆ ఇంట్లో కాలు మోపేలా చేసినందుకు వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని