ఏపీసీటీవో సబార్డినేట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గోపాలకృష్ణయ్య
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

ఏపీసీటీవో సబార్డినేట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గోపాలకృష్ణయ్య


గోపాలకృష్ణయ్యను అభినందిస్తున్న సంఘ నాయకులు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: వాణిజ్య పన్నుల శాఖ ఆఫీస్‌ సబార్డినేట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాపట్ల గోపాలకృష్ణయ్య ఎన్నికయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న పి.గోవిందరాజులు స్వచ్ఛంద విరమణ చేయడంతో గురువారం ఎన్నిక నిర్వహించారు. మొత్తం 30 ఓట్లు పోలవగా, పోటీలో ఉన్న బి.గోపాలకృష్ణయ్య(విజయవాడ)కు 24, ఆర్‌.సత్యనారాయణ(విశాఖపట్నం)కు 6 ఓట్లు వచ్చాయి. 18 ఓట్ల మెజార్టీతో గోపాలకృష్ణ విజయం సాధించారని ఎన్నికల అధికారి ఎస్‌.మల్లేశ్వరరావు వెల్లడించారు. సహాయ ఎన్నికల అధికారులుగా కొండయ్య, సురేష్‌, ప్రవీణ్‌ వ్యవహరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని