ఇంజినీరింగ్‌ విద్యార్థినికి రూ.30 లక్షల వార్షిక వేతనం
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

ఇంజినీరింగ్‌ విద్యార్థినికి రూ.30 లక్షల వార్షిక వేతనం


శ్రేయ, తండ్రి మురళీకృష్ణతో కళాశాల ప్రతినిధులు 

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: జీఈసీలో కంప్యూటర్‌సైన్స్‌ చివరి సంవత్సరం విద్యార్థిని పొట్లూరి శ్రేయ అమెజాన్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా ~ 30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశం పొందారు. గురువారం ఈ మేరకు జీఈసీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రేయ, తన తండ్రి పొట్లూరి మురళీకృష్ణ, కళాశాల ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. దేశవ్యాప్తంగా అమెజాన్‌లో ఉద్యోగాలకు ఎంపికైన ఆరుగురిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి శ్రేయ ఒక్కరే ఈ ఘనత సాధించారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతూనే తను సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ స్కిల్స్‌పై దృష్టి పెట్టానని, అన్ని రకాల సాఫ్ట్‌వేర్‌ల కోడింగ్‌పై నైపుణ్యం సాధించానని, ఈ మేరకు రోజుకు 16 గంటల పాటు శ్రమించానని శ్రేయ వెల్లడించారు. తన తల్లి శ్యామల(వ్యవసాయశాఖ ఏడీఏ), తండ్రి మురళీకృష్ణ, కళాశాల అధ్యాపకబృందం, ప్లేస్‌మెంట్‌సెల్‌ సహకారంతో ఈ అవకాశాన్ని చేజించుకోగలిగానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెను ప్రిన్సిపల్‌ గుత్తా ప్రసాద్‌, వైస్‌ప్రిన్సిపల్స్‌ పి.కోదండరామయ్య, విభాగాధిపతి బాబూరావు, ప్లేస్‌మెంట్‌ అధికారి కె.సాయికృష్ణ తదితరులు ఆమెను అభినందించి అమెజాన్‌ తరఫున నియామక పత్రాన్ని అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని