మంచి ఆలోచనతో చెత్తకు చెక్‌
eenadu telugu news
Published : 17/09/2021 04:03 IST

మంచి ఆలోచనతో చెత్తకు చెక్‌

ఈనాడు, అమరావతి 

గతంలో విజయవాడలోని యనమలకుదురు నుంచి అవనిగడ్డకు వెళ్లే కరకట్ట రోడ్డు కాలువ పొడవునా చెత్తా చెదారాలతో అధ్వానంగా ఉండేది. ఆ రోడ్డులో చుట్టుపక్కల నుంచి చెత్త తీసుకొచ్చి పోసేవారు. అటు వెళ్లాలంటేనే కంపుకొట్టేది. ఇప్పుడు కట్ట వెంబడి ఇళ్ల సముదాయాలు పెరగడంతో గ్రామ పెద్దలందరూ దీనికి ఓ పరిష్కారం ఆలోచించారు. కట్ట వెంబడి కొంత స్థలంలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసి చుట్టూ చిన్న ఉద్యానవనంలా తయారు చేశారు. దీంతో చెత్త వేయడం మానేశారు. కొన్నిచోట్ల ఇక్కడ చెత్త వేయరాదని ప్రచార బోర్డులు కూడా పెట్టడంతో ఆ ప్రదేశమంతా పరిశుభ్రంగా తయారైంది.

గతంలో రోడ్డు పక్కన చెత్త

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని