నార్కో అనాలసిస్‌ పిటిషన్‌పై 21న తీర్పు
eenadu telugu news
Published : 18/09/2021 03:11 IST

నార్కో అనాలసిస్‌ పిటిషన్‌పై 21న తీర్పు

విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో 2007లో జరిగిన ఆయేషా మీరా హత్యకేసులో విచారణ నిమిత్తం ఎనిమిది మందిని నార్కో అనాలసిస్‌ పరీక్షలకు అనుమతించాలని సీబీఐ అధికారులు విజయవాడ నాలుగో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయమూర్తి ఈ నెల 21కి వాయిదా వేశారు. కోనేరు సతీష్‌తోపాటు అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సుంకర మురళీమోహన్‌(56), ఎస్సై గంటి శ్రీనివాసరావు(57)లను నార్కోకు అనుమతించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సత్యంబాబు అనే వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన విషయం విదితమే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని