గుడివాడలో హత్య
eenadu telugu news
Published : 18/09/2021 03:11 IST

గుడివాడలో హత్య

స్నేహితుల మధ్య వివాదం

గొడ్డలితో నరికి చంపిన వైనం

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడలో గురువారం రాత్రి జరిగిన హత్యతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాత గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారని పోలీసులు తెలిపారు. ఓవర్‌బ్రిడ్జి కింద ఉండే బత్తుల సాయికుమార్‌(22) తాపీపని, క్యాటరింగ్‌ పనులు చేసుకొని జీవిస్తుంటాడు. రైలుపేటకు చెందిన రాపానీ ఏసు కూలీ పనులు చేసుకుంటుంటాడు. వారిద్దరూ స్నేహితులు. ఇటీవల వారి మధ్య వివాదం ఏర్పడింది. ఎలాగైనా సాయికుమార్‌ను చంపాలని ఏసు ప్రణాళిక వేసుకున్నాడు. గురువారం రాత్రి 11.30 సమయంలో రైల్వేస్టేషన్‌ బయట ఆవరణలో ఉన్న సాయికుమార్‌ను వెతుక్కుంటూ వచ్చిన ఏసు వెంటతెచ్చుకున్న గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ముఖంపై, గొంతు, వీపుపై గొడ్డలివేటు పడటంతో విపరీతంగా రక్తస్రావం అవుతున్న సాయిని తొలుత 108లో గుడివాడ ఏరియా ఆస్పత్రికి తర్వాత విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. సీఐ దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని