సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
eenadu telugu news
Published : 18/09/2021 03:11 IST

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కృష్ణలంక, న్యూస్‌టుడే: అక్టోబరు 10న నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ జె.నివాస్‌ చెప్పారు. యూపీఎస్సీ ప్రతినిధులు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు 29 కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 13,674 మంది హాజరు కానున్నారని తెలిపారు. 29 మంది లైజన్‌ అధికారులు, 101 మంది అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు, 581 మంది ఇన్విజిలేటర్లను నియమించామని పేర్కొన్నారు. విభిన్న పత్రిభావంతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, కలెక్టరేట్‌ ఏవో వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని