సజావుగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు
eenadu telugu news
Published : 18/09/2021 03:11 IST

సజావుగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు


పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న ఈశ్వరయ్య

మాచవరం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ బెటర్మెంట్‌ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సభ్యుడు ఈశ్వరయ్య అన్నారు. పరీక్షల నిర్వహణ హైపవర్‌ కమిటీ సభ్యులతో కలిసి విజయవాడ నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు చాలా ఎక్కువ మంది పరీక్షలు రాస్తున్నారని, సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు తక్కువ మంది రాస్తున్నారన్నారు. ఇప్పటికే ఎంసెట్‌ ఫలితాలు వెల్లడికావడంతో హాజరు తక్కువగా ఉందన్నారు. చిట్టినగర్‌లోని సయ్యద్‌ అప్పలస్వామి జూనియర్‌ కళాశాలలో ఇద్దరు సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, వారికి కొవిడ్‌ నిబంధనలతోపాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. బెంజిసర్కిల్‌లోని నారాయణ బాలికల జూనియర్‌ కళాశాల కేంద్రంలో ఒక విద్యార్థినికి కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో కొవిడ్‌ గదిలో పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వెంట ఇంటర్‌ విద్యా మండలి ప్రాంతీయ తనిఖీ అధికారి పి.రవికుమార్‌, హైపవర్‌ కమిటీ సభ్యుడు ఐనంపూడి ఆనంద్‌కుమార్‌ ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని