కాంస్యంతో మెరిసిన ప్రీతి లాంబ
eenadu telugu news
Published : 18/09/2021 03:26 IST

కాంస్యంతో మెరిసిన ప్రీతి లాంబ

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: హనుమకొండలో జరుగుతున్న జాతీయ సీనియర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత రైల్వేస్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బెజవాడ డివిజన్‌ క్రీడాకారిణి ప్రీతి లాంబ కాంస్య పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన 3000మీ స్టీపుల్‌ఛేజ్‌ను 10నిమిషాల, 22.45 సెకన్లలో పూర్తి చేసి తృతీయ స్థానంలో నిలిచిందని వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్పోర్ట్స్‌) ఎన్‌.అర్జునరావు తెలిపారు. ప్రీతిని డీఆర్‌ఎం షివేంద్ర మోహన్‌, ఏడీఆర్‌ఎంలు డి.శ్రీనివాసరావు, ఎం.శ్రీకాంత్‌, డివిజనల్‌ స్పోర్ట్స్‌ అధికారి వల్లేశ్వర బి.తోకల చరవాణి ద్వారా అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని