రికర్వ్‌ రౌండ్‌లో జిల్లా ఆర్చర్ల సత్తా
eenadu telugu news
Published : 18/09/2021 03:26 IST

రికర్వ్‌ రౌండ్‌లో జిల్లా ఆర్చర్ల సత్తా


విల్లు ఎక్కుపెట్టిన క్రీడాకారులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ఆతిథ్య కృష్ణా జిల్లా ఆర్చర్లు సత్తా చాటారు. గుణదల విజయలక్ష్మి కాలనీలోని చెరుకూరి ఓల్గా ఆర్చరీ మైదానంలో జరుగుతున్న ఛాంపియన్‌షిప్‌లో శుక్రవారం రికర్వ్‌ రౌండ్‌లో స్త్రీ, పురుషుల విభాగాల్లో తొలి నాలుగు స్థానాల్లో మూడు స్థానాలను కృష్ణా ఆర్చర్లు కైవసం చేసుకొని రాష్ట్ర జట్టులో స్థానం సాధించారు. రికర్వ్‌ రౌండ్‌లో పలు జిల్లాల నుంచి 70 మంది ఆర్చర్లు ఉత్సాహంగా తలపడ్డారు. వారు సాధించిన స్కోర్లు ఆధారంగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆర్చర్లను రాష్ట్ర రికర్వ్‌ రౌండ్‌ జట్టుకు ఎంపిక చేశామని రాష్ట్ర విలువిద్య సంఘం ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ తెలిపారు. ప్రపంచ యూత్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి పసిడి పతకం సాధించిన బొమ్మదేవర ధీరజ్‌ జాతీయ శిక్షణ శిబిరంలో ఉండడంతో, రాష్ట్ర విలువిద్య సంఘం నుంచి అనుమతి తీసుకుని రాష్ట్ర జట్టులో నేరుగా స్థానం కల్పించామని చెప్పారు. ఎంపికైన ఆర్చర్లు వచ్చే నెల ఒకటి నుంచి జమ్‌షెడ్‌పూర్‌లో జరిగే జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఎంపికైన ఆర్చర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

* పురుషుల జట్టు: బొమ్మదేవర ధీరజ్‌, చిట్టిబొమ్మ జిజ్ఞాస్‌, దేవినేని మైత్రేయ (కృష్ణా), సొలగం సాంబశివ (విశాఖపట్నం), స్టాండ్‌ బైగా గెమ్మెలి బైరాగినాయుడు (విశాఖపట్నం).

* మహిళల జట్టు: ఉక్కు సుమ (నెల్లూరు), కుందేరు చంద్రహాసిని, ఆకుల రవళి, బెల్లంకొండ వైష్ణవి (కృష్ణా), స్టాండ్‌ బైగా కఠారి ప్రియ (నెల్లూరు)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని