అక్రమాలకు పాల్పడిన ఆర్పీ తొలగింపు
eenadu telugu news
Published : 18/09/2021 04:16 IST

అక్రమాలకు పాల్పడిన ఆర్పీ తొలగింపు

 

పొన్నూరు, న్యూస్‌టుడే: మెప్మా సిబ్బంది, బ్యాంకు అధికారిణి కుమ్మక్కై పొదుపు రుణాల పేరిట రూ.37.50 లక్షలు స్వాహా చేశారు. గత నెల 31న ‘ఈనాడు’లో ‘కుమ్మక్కై కాజేశారు’ అనే శీర్షికతో ఓ ప్రత్యేక కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటరమణ పొన్నూరులో చోటుచేసుకున్న అక్రమాలపై విచారించారు. 21వ వార్డులో 35 పొదుపు సంఘాలున్నాయి. సంఘానికి ఇద్దరు సభ్యుల చొప్పున అధికారులు సమావేశానికి పిలిపించారు. ఆర్పీ వనకుమారి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని, ఆమెను విధుల్లో నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టు తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు సీఈవో జ్యోతి వెల్లడించారు. అందుకు సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడంలో ఆర్పీని విధుల్లో నుంచి తప్పిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు అక్రమాలకు పాల్పడిన ముగ్గురు ఆర్పీలను తొలగించినట్టైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని