పచ్చబొట్టుతో అభిమానాన్ని చాటి..
eenadu telugu news
Updated : 18/09/2021 11:36 IST

పచ్చబొట్టుతో అభిమానాన్ని చాటి..

చేతిపై పచ్చబొట్టును ఎమ్మెల్యే రజినికి చూపిస్తున్న అనిల్‌

చిలకలూరిపేట: చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని చిత్రాన్ని పచ్చబొట్టు రూపంలో వేయించుకుని కరీంనగర్‌ జిల్లా కరీంనగర్‌ రూరల్‌ మండలం చామనపల్లి వాసి దూడం అనిల్‌ అభిమానాన్ని చాటుకున్నాడు. ఎమ్మెల్యేని శుక్రవారం ఆమె కార్యాలయంలో కలసి పచ్చబొట్టు చూపించాడు. ఆమె చేస్తున్న కార్యక్రమాలు చూసి అభిమానిగా మారినట్లు యువకుడు చెప్పాడు. అతని పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే స్పందించి యువకునికి ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని