అలసత్వం సహించేది లేదు
eenadu telugu news
Published : 18/09/2021 04:16 IST

అలసత్వం సహించేది లేదు


మాట్లాడుతున్న డీఈవో గంగాభవాని

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి అలసత్వం సహించేది లేదని డీఈవో ఆర్‌.ఎస్‌.గంగాభవాని తెలిపారు. గుంటూరులోని పాతబస్టాండ్‌ కూడలి వద్ద ఉన్న పరీక్ష భవన్‌లో శుక్రవారం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన ఐఎంఎంఎస్‌ అప్లికేషన్‌, డ్యాష్‌బోర్డులపై ప్రధానోపాధ్యాయులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉపాధ్యాయులు, నిర్వాహకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో గంగాభవాని మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం అమలులో అందరూ సమన్వయంతో పని చేయడం వల్లే గుంటూరు జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. ఏవైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. జిల్లా స్థాయిలో జగనన్న గోరుముద్ద, పాఠశాలల పారిశుద్ధ్యానికి సంబంధించిన నివేదికలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గుంటూరు, తెనాలి ఉప విద్యాశాఖాధికారులు కె.సుధాకర్‌రెడ్డి, వి.శ్రీనివాసరావు, ఉర్దూ పాఠశాలల డీఐ షేక్‌ మహమ్మద్‌ ఖాసిం, జిల్లా ఎంఈవోల సంఘం నాయకులు సీహెచ్‌.రవికాంత్‌, శర్మ, సీనియర్‌ ప్రధానోపాధ్యాయుడు ఎ.తిరుమలేష్‌, మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షకుడు టి.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని