AP News: చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనలపై రెండు కేసుల నమోదు
eenadu telugu news
Updated : 18/09/2021 12:03 IST

AP News: చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనలపై రెండు కేసుల నమోదు

అమరావతి : తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద నిన్న చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తెదేపా నేత జంగాల సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయగా.. ఎమ్మెల్యే జోగి రమేశ్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు.

శుక్రవారం పెడన శాసనసభ్యుడు జోగి రమేశ్‌ పెద్దసంఖ్యలో తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కర్రలు, రాళ్లతో వైకాపా, తెదేపా నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల లాఠీఛార్జి చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని