ముద్ర వేయాల్సిందే..
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

ముద్ర వేయాల్సిందే..

సత్తెనపల్లి, న్యూస్‌టుడే
పట్టణ డ్వాక్రా మహిళల బయోమెట్రిక్‌ సేకరణలో సీఆర్‌పీలు

స్వయం సహాయక సంఘాల రుణాల మాఫీకి ఉద్దేశించిన వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత లబ్ధి అందించేందుకు పట్టణ పొదుపు మహిళల బయోమెట్రిక్‌ వివరాల సేకరణ బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా మొదలైంది. త్వరితగతిన ఆసరా లబ్ధికి అర్హత సాధించిన మహిళల వేలిముద్ర, బ్యాంకు ఖాతా, ఆధార్‌ ఇతర వివరాలు యాప్‌లో నమోదు చేయాలని పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఉన్నతాధికారుల నుంచి మార్గదర్శకాలు అందాయి. సీఆర్‌పీలు మెప్మా కార్యాలయాల్లో.. సమాఖ్యలు.. సంఘాల వద్దకు వెళ్లి వేలిముద్రలు సేకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతుండటంతో చాలా మంది పట్టణాలను వీడి అటువైపు వెళ్లారు. వారికి సమాచారం అందజేసి వేలిముద్రలు సేకరిస్తున్నారు. గ్రామాల్లో రెండు నెలల క్రితమే ఈ ప్రక్రియను పూర్తి చేయగా పట్టణాల్లో హడావుడిగా ప్రారంభించారు. గుంటూరు నగరంతో పాటు 12 పట్టణాల పరిధిలోని 16,579 సంఘాలు రెండో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా లబ్ధికి అర్హత సాధించాయి. ఈ సంఘాల్లో 1,57,724 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారందరి బయోమెట్రిక్‌ వివరాల సేకరణ యుద్ధప్రాతిపదికన చేపట్టారు. వేలిముద్ర వేయకుంటే ఆసరా లబ్ధి అందదనే ప్రచారంతో బయోమెట్రిక్‌ వివరాలు ఇచ్చేందుకు పొదుపు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. సర్వర్‌ పని చేయక యాప్‌లో వివరాల నమోదుకు చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని