జల సంరక్షణ ప్రజలందరి బాధ్యత
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

జల సంరక్షణ ప్రజలందరి బాధ్యత


నీటి ప్రాముఖ్యాన్ని వివరిస్తున్న గోపాలకృష్ణ

కృష్ణలంక, న్యూస్‌టుడే: ప్రస్తుతం నీటిని వృథా చేస్తే భవిష్యత్తు తరాల కళ్లల్లో నీళ్లు చూడాల్సి వస్తుందని సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ అన్నారు. ప్రపంచ జల పర్యవేక్షణ దినోత్సవం సందర్భంగా శనివారం కస్తూరిబాయి పేటలోని రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ నీటిని సామాజిక ఆస్తిగా భావించాలని, జలసంరక్షణకు ముందుకు రావాలని సూచించారు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న నీటిలో 97 శాతం సముద్ర జలమేనని, ఒక్క శాతం అంటార్కిటికా, హిమాలయాల వంటి మంచు వ్యవస్థల్లో ఉంటుందని, కేవలం రెండు శాతం మాత్రమే మానవుల వ్యక్తిగత అవసరాలకు, వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి అందుబాటులో ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో భావితరాలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని