‘సీఎం సహకారంతోనే దాడి’
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

‘సీఎం సహకారంతోనే దాడి’

తెదేపా కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పార్టీ నాయకులు

ఆటోనగర్‌, న్యూస్‌టుడే: సీఎం సహకారంతోనే ఎమ్మెల్యే జోగి రమేష్‌.. చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారని, దీనిని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం ఆటోనగర్‌లోని తెదేపా కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంటి మీద దాడి చేసే దౌర్భాగ్యానికి ప్రస్తుత సీఎం జగన్‌ దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి కావాలంటే ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకోవాలని జోగి రమేష్‌కు సూచించారు. డీజీపీ తన పదవికి, డిపార్టుమెంట్‌కు పేరొచ్చే విధంగా పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధి హామీ మండలి మాజీ డైరెక్టర్‌ వీరంకి వెంకట గురుమూర్తి, దొంతు చిన్నా, సింహాద్రి కనకాచారి, ఎస్‌.ఫిరోజ్‌, లింగమనేని శివరాంప్రసాద్‌, జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని