Votes Counting: ఏపీలో కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
eenadu telugu news
Updated : 19/09/2021 10:48 IST

Votes Counting: ఏపీలో కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

అమరావతి: ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 515 జడ్పీటీసీ స్థానాలు, 7,220 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఓట్ల లెక్కింపునకు రాష్ట్రంలోని 206 కేంద్రాల్లోని 958 హాళ్లలో ఏర్పాట్లు చేశారు. దీని కోసం 609 మంది ఎన్నికల అధికారులు, 1,047 మంది సహాయ ఎన్నికల అధికారులను నియమించారు. 11,227 మంది పర్యవేక్షకులు, 31,133 మంది సహాయ పర్యవేక్షకులు సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌ సెంటర్‌ (ఫోన్‌ నంబరు: 0866 2466877) ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటినా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి, విజేతలను ప్రకటిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని