AP News: డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తెదేపా నేతలు.. కేసు నమోదు
eenadu telugu news
Updated : 19/09/2021 11:41 IST

AP News: డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తెదేపా నేతలు.. కేసు నమోదు

అమరావతి: ఏపీ డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తెదేపా నేతలపై కేసు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా నేతలపై తాడేపల్లి ఏ.ఎస్‌.ఐ మధుసూదనరావు ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయం గేట్లు నెట్టి వేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఏ.ఎస్‌.ఐ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, అమర్నాథ్‌రెడ్డి, ఆలపాటి రాజేంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, గొట్టిపాటి రవి, డోల బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, బోడె ప్రసాద్‌, తెనాలి శ్రావణ్‌, జీవీ ఆంజనేయులు, నజీర్‌పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని