ఇద్దరు బాలురకు డెంగీ లక్షణాలు: ఒకరి మృతి
eenadu telugu news
Published : 20/09/2021 05:33 IST

ఇద్దరు బాలురకు డెంగీ లక్షణాలు: ఒకరి మృతి

మంగళగిరి, న్యూస్‌టుడే: నగరంలో డెంగీ లక్షణాలతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం ఇద్దరు బాలురకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. వీరిలో నగరంలోని పార్క్‌రోడ్డుకు చెందిన బాలుడు (7) ఆదివారం రాత్రి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు తల్లిదండ్రులు రోదిస్తూ తెలిపారు. ఆ బాలుడి మృతికి కారణాలు తెలుసుకుంటున్నామని మలేరియా సిబ్బంది చెప్పారు. 8వ వార్డు ఆంజనేయ కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలుడికి డెంగీ లక్షణాలు కనిపించాయని, విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స చేయించగా, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని మలేరియా అధికారి సాగర్‌ తెలిపారు. నగరపాలక సంఘానికి సమాచారం ఇచ్చి ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచనలు చేసినట్లు ఆయన వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని