తడిసిన ఓట్లతో తంటా
eenadu telugu news
Updated : 20/09/2021 11:00 IST

తడిసిన ఓట్లతో తంటా


తడిసిన ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

కొల్లూరు, న్యూస్‌టుడే: ప్రాదేశిక ఎన్నికల పోలింగు అనంతరం బ్యాలెట్‌ పెట్టెలను తెనాలి వీఎస్‌ఆర్‌ కళాశాలలో అధికారులు భద్రపరిచారు. ఓట్ల లెక్కింపులో జాప్యం జరగడంతో గదుల్లోని బ్యాలెట్‌ పెట్టెలను అధికారులు పరిశీలించలేకపోయారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆదివారం ఓట్ల లెక్కింపు నిమిత్తం ఆ పెట్టెలను బయటకు తీశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొల్లూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఓట్ల పెట్టెలు తడిసిపోయాయి. కొల్లూరు, అనంతవరం, చినపులివర్రు, చిలుమూరు, ఈపూరు, ఈపూరులంక, క్రాప గ్రామాలకు చెందిన ఓట్లు తడవడంతో అధికారులు లెక్కించడానికి అవస్థలు పడ్డారు. ఓట్ల పత్రాలను పంకాల కింద ఆరబెట్టారు. ఓటర్లు వేసిన ముద్ర కొన్నింటిపై చెరిగిపోవడంతో వాటిని చెల్లని ఓట్లుగా పరిగణించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓట్ల పట్రాలను ఆరబెట్టే పనిలోనే వారు నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న విలేకర్లను ఆ గది వైపునకు వెళ్లనీయకుండా అధికారులు ఆంక్షలు విధించారు. అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని