త్వరలో సర్వీసుల క్రమబద్ధీకరణ
eenadu telugu news
Published : 20/09/2021 05:33 IST

త్వరలో సర్వీసుల క్రమబద్ధీకరణ


మాట్లాడుతున్నసచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: టైమ్‌స్కేల్‌, ఒప్పంద ఉద్యోగుల సర్వీసులను త్వరలో క్రమబద్ధీకరించే అవకాశం ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి చెప్పారు. ఆదివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో టైమ్‌స్కేల్‌ ఉద్యోగుల సంఘం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన 12 హామీల్లో తొమ్మిందిటిని పరిష్కరించిందన్నారు. మిగిలిన హామీలను త్వరలో పరిష్కరించే అవకాశముందని చెప్పారు. కొంతమంది ఉన్నతాధికారుల వైఖరి వల్లే ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు. కార్యక్రమంలో ‘ఆంటియా’ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటప్పారెడ్డి, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు అమ్మిరెడ్డి, నందేశ్వరరావు, జయరామకృష్ణ, సన్యాసిరావు, ప్రసాద్‌, బాలాజీ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని