26న బాలు స్మారక పురస్కారాల ప్రదానం
eenadu telugu news
Updated : 20/09/2021 05:55 IST

26న బాలు స్మారక పురస్కారాల ప్రదానం

ఆహ్వాన పత్రాలు ఆవిష్కరిస్తున్న రంగారావు తదితరులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: కళాదర్బార్‌ ఆంధ్రప్రదేశ్‌, ఠాగూర్‌ మెమోరియల్‌ థియేటర్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 26న సాయంత్రం 5 గంటలకు గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి నిర్వహిస్తున్నట్లు కళాదర్బార్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు చెప్పారు. విజ్ఞాన మందిరంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆహ్వాన పత్రాల ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌.పి.బాలు మెమోరియల్‌ పురస్కారాలను 8 మంది ప్రముఖ గాయనీ, గాయకులు రామాచారి, శశికళ, యోగిసురేష్‌, శ్రీధర్‌ అయ్యర్‌, లిప్సిక, సాకేత్‌, హరిణి, సాయిచరణ్‌లకు ఇచ్చి సత్కరిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కన్నుమూసిన సీనియర్‌ సినీ గాయకుడు జి.ఆనంద్‌ పేరున మెమోరియల్‌ అవార్డులను సురేఖామూర్తి, రాము, విజయలక్ష్మి, వినోద్‌బాబులకు ఇచ్చి సత్కరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ‘మన బాలూ కథ’ పుస్తకావిష్కరణ ఉంటుందని చెప్పారు. గౌరవ అతిథులుగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, ఎమ్మెల్యేలు మహ్మద్‌ ముస్తఫా, మద్దాళి గిరిధర్‌రావు, పార్లమెంటు మాజీ సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, గౌరవ అతిథులుగా వస్తున్నారన్నారు. దాదాపు రెండు గంటల పాటు గాయనీ, గాయకులతో బాలు స్వరాభిషేకం ఉంటుందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని