ఓగిరాలలో ఉత్కంఠ
eenadu telugu news
Updated : 20/09/2021 06:15 IST

ఓగిరాలలో ఉత్కంఠ

రీకౌంటింగ్‌ నిర్వహిస్తున్న దృశ్యం

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: బాపులపాడు మండలం ఓగిరాల ఎంపీటీసీ స్థానం ఫలితం తీవ్ర ఉత్కంఠకు, ఉద్రిక్తతకు దారితీసింది. మొత్తం 1,088 ఓట్లు పోలవగా తెదేపా అభ్యర్థి తోకల సుబ్బారావుకు 527, వైకాపా అభ్యర్థి ప్రత్తిపాటి కిరణ్‌కుమార్‌కు 525 ఓట్లు వచ్చాయి. ఎనిమిది ఓట్లు చెల్లకుండా పోగా, 28 ఓట్లు నోటాకు పడ్డాయి. దీంతో తెదేపా గెలిచినట్లయ్యింది. రీకౌంటింగ్‌ జరపాలని వైకాపా డిమాండ్‌ చేయడంతో చెల్లని ఓట్లలో ఒకదానిని వైకాపా ఖాతాలో వేశారు. దీంతో తెదేపా ఆధిక్యం ఒక ఓటుకు చేరింది. ఈ సమయంలో చెల్లని ఓట్లలో మరో రెండు కూడా పరిగణనలోకి తీసుకుని తమ ఖాతాలో వేయాలని వైకాపా అభ్యర్థి, ఏజెంటు కోరారు. దీనికి తెదేపా అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. బ్యాలెట్‌ పత్రాల పరిశీలన సందర్భంగా సైకిల్‌ గుర్తుకు పడిన ఓటు, వైకాపా తరఫున లెక్కించినట్లు గుర్తించారు. దీంతో రెండు ఓట్ల ఆధిక్యంతో తెదేపా విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. తెదేపా నేత ఆళ్ల గోపాలకృష్ణ రీకౌంటింగ్‌లో కీలకపాత్ర వహించి తెదేపా అభ్యర్థి విజయానికి కృషి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని