ప్రజా తీర్పును గౌరవించండి : మంత్రి కొడాలి
eenadu telugu news
Published : 20/09/2021 05:57 IST

ప్రజా తీర్పును గౌరవించండి : మంత్రి కొడాలి


మంత్రి నాని, ఉప్పాల రాంప్రసాద్‌ను గజమాలతో సత్కరిస్తున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు

గుడివాడ, న్యూస్‌టుడే: ప్రజాతీర్పును చంద్రబాబు, ఆయన తోకపార్టీలు గౌరవించి, ఇప్పటికైనా జగన్‌ పరిపాలనకు సహకరించి సలహాలు ఇవ్వాలని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 99 శాతం జడ్పీటీసీ స్థానాలు, 95 శాతం ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ వైకాపా ఘనవిజయం సాధించిందని, రానున్న సాధారణ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు. ఆయనతో ఉంటున్న జనసేన, భాజపా, సీపీఎం, సీపీఐలు ప్రజాతీర్పును గౌరవించి వైకాపా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఈ సందర్భంగా గుడ్లవల్లేరు జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా భావిస్తున్న హారికను మంత్రి అభినందించారు. పార్టీశ్రేణులు మంత్రి నాని, డీసీఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ ఉప్పాల రాంప్రసాద్‌ను గజమాలతో సత్కరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని