‘ఫోర్టో’ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
eenadu telugu news
Published : 20/09/2021 06:05 IST

‘ఫోర్టో’ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం


సంఘీభావం తెలియజేస్తున్న సభ్యులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో ఆదివారం ‘ఫోర్టో’ (ఫోరమ్‌ ఆఫ్‌ రిజిస్టర్డ్‌ టీచర్‌ ఆర్గనైజేషన్‌) జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మాగంటి శ్రీనివాసరావు తెలిపారు. గౌరవాధ్యక్షునిగా డొక్కు శ్రీనివాసరావు (ఎన్‌టీఏ), అధ్యక్షునిగా మాడపాటి లక్ష్మణరాజు (ఎస్‌జీటీఎఫ్‌), ప్రధాన కార్యదర్శిగా చాట్రగడ్డ సుధాకర్‌ (ఏపీఎస్‌ఏ పీఈఏ), సహాధ్యక్షులుగా తిరుమలరాజు విజయవర్మ (ఏపీఏఎన్‌ఓఏ), కూనపరెడ్డి సుబ్రహ్మణ్యం (ఎస్‌ఎల్‌టీఏ), కోశాధికారిగా గుగులోతు భలియా నాయక్‌ (ఎస్‌సీ, ఎస్‌టీ యూఎస్‌), మహిళా కార్యదర్శిగా బోయిన శ్రీగంగ (ఏపీఎస్‌ఏ పీఈఏ), మీడియా కన్వీనర్లుగా బొల్లిముంత రామానందసాగర్‌ (ఎస్‌జీటీఎఫ్‌), కె.ప్రభాకర్‌ (ఎన్‌టీఏ), వి.రమేష్‌ (ఏపీఎస్‌ఏ పీఈఏ)లు ఎన్నికయ్యారని ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని