AP News: పరిషత్‌ ఓట్ల లెక్కింపు పూర్తి.. ఫైనల్‌ లిస్ట్‌ ఇదే!
eenadu telugu news
Updated : 20/09/2021 08:04 IST

AP News: పరిషత్‌ ఓట్ల లెక్కింపు పూర్తి.. ఫైనల్‌ లిస్ట్‌ ఇదే!

అమరావతి: ఏపీలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. కొన్ని జడ్పీటీసీ స్థానాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా లెక్కింపు కొనసాగింది. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందిన పార్టీల వివరాలను అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. 5998 చోట్ల వైకాపా, 826 చోట్ల తెదేపా, 177 చోట్ల జనసేన, 28 చోట్ల భాజపా, 15 చోట్ల సీపీఎం, 8 చోట్ల సీపీఐ, 157 చోట్ల ఇండిపెండెంట్‌ అభ్యర్థులు విజయం సాధించారు. 515 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా.. 502 చోట్ల వైకాపా, 6 చోట్ల తెదేపా, 2 చోట్ల జనసేన, సీపీఎం, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు చెరో చోట గెలుపొందారు. జిల్లాల వారీగా వివరాలను కింద చూడొచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని