చిత్ర వార్తలు
eenadu telugu news
Updated : 21/09/2021 04:01 IST

చిత్ర వార్తలు

మూగజీవులపై మమకారం

విజయవాడ నగరం లోటస్‌ ల్యాండ్‌ మార్క్‌ ప్రాంతంలో ఓ వీధి కుక్క ఆరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇంతలో గాలి వానకు గోడ మీద ఉన్న పూల కుండీ పై నుంచి హఠాత్తుగా మీద పడడంతో అక్కడికక్కడే తనువు చాలించింది. పిల్లలు మాత్రం... ప్రాణాలతో బయటపడ్డాయి. వీటి ఏడుపులు విన్న వెంకటేష్‌ స్పందించి, సంరక్షించారు. గత మూడు రోజులుగా పాలు పడుతూ.. పోషిస్తున్నారు.

- ఈనాడు, అమరావతి


రెండేళ్లుగా రోడ్డు పక్కనే..


పాత సీఆర్‌డీఏ కార్యాలయం బయట రహదారిపై వదిలేసిన రాళ్లు

రాజధాని ప్రాంతం తుళ్లూరులో పాత సీఆర్‌డీఏ కార్యాలయం బయట ఆవరణను తీర్చిదిద్దడానికి తీసుకువచ్చిన పార్కింగ్‌ రాళ్లను రెండేళ్లుగా రహదారి పక్కనే వదిలేశారు. కొందరు వాటిని పట్టుకుపోతున్నా.. పట్టించుకునే వారు లేరు. అధికారులైనా కనీసం కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవడం లేదు. ఖర్చు ఎందుకులే అని వదిలేశారు. దీంతో ఇలా సీఆర్‌డీఏ కార్యాలయం బయటే రాళ్లు దర్శనమిస్తున్నాయి.

- ఈనాడు, అమరావతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని