‘జగనన్నా..ఇచ్చిన మాట నిలబెట్టుకో ’
eenadu telugu news
Published : 21/09/2021 02:55 IST

‘జగనన్నా..ఇచ్చిన మాట నిలబెట్టుకో ’

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: జగనన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుని కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలంటూ పలువురు పారా మెడికల్‌ ఉద్యోగ సంఘ నాయకులు కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్‌ పారామెడికల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ డీఎస్సీ కాంట్రాక్ట్‌ పారా మెడికల్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మచిలీపట్నంలోని జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా వైద్యఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్న పారా మెడికల్‌ ఉద్యోగులు అందరినీ అర్హత, సర్వీసు ఆధారంగా రెగ్యులర్‌ చేస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. తమ సమస్యల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 112 రోజులుగా అన్ని జిల్లాల్లోనూ జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలుపుతున్నామని, 113వ రోజు మచిలీపట్నంలో చేపట్టామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని